స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. డిఫరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే బన్నీ సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్‌ను తనఖాతాలో వేసుకున్నాడు. తర్వాత గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే.. దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్స్ కూడా సినిమా మీద భారీ అంచనాల్ని పెంచుతున్నాయి. అయితే…అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ కోసం సంగీతదర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన గీతాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి.
పది రోజుల క్రితం విడుదలైన మొదటిపాట ‘శరణం భజే భజే’కు మంచి రెస్పాన్స్ రాగా, ఇటీవల విడుదలైన రెండో పాట ‘గుడిలో బడిలో’ అనే పాటను రిలీజ్ చేసింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే దువ్వాడ లేటెస్ట్ సాంగ్ అరకోటికి పైగా వ్యూస్‌ని సాధించింది. ఒకవైపు యూ ట్యూబ్‌లో సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఈ సాంగ్.. మరోవైపు ఓ వివాదంలో చిక్కుకుంది.
సాహితీ రచన చేసిన అస్మైక యోగా.. తస్మిక భోగ అనే గీతంలో ఆశగా నీకు పూజలే చేయ ఆలకించికింది ఆ నమ్మకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకించింది ఆ చమకం అంటూ శివుడికి ప్రీతిపరమైన నమకం చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ గీతంలో గుడిలో, బడిలో, మడిలో, ఒడిలో, అగ్రహారంలోని తమలపాకు, తమకం, చమకం వంటి పదాలను సెన్సార్ చేయాలని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ద్రోణం రాజ్‌కుమార్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.
డీజే సాంగ్ వివాదంపై డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందించాడు. వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తాను బ్రాహ్మణ సంప్రదాయాలను కించపరిచే విధంగా సినిమా తీయనని, బ్రాహ్మణుడు తలచుకుంటే ఏదైనా సాధించగలడనే పాయింట్‌తోనే ఈ సినిమా తీశానని, బ్రాహ్మణ సమాజం తలెత్తుకునేలా దువ్వాడ జగన్నాథం ఉంటుందని బ్రాహ్మణ సంఘాలకు భరోసా ఇచ్చాడు హరీశ్. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.