అఖిల్‌ తల్లి ఎవరో తెలుసా..?

299
Tabu to act as Akhil Akkineni`s mother
- Advertisement -

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న అఖిల్ రెండవ సినిమా శరవేగంగా షూటింగ్‌ కంప్లీట్‌ అవుతోంది.  ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్ కు సిద్దమౌతుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ముఖ్యమైన అఖిల్ తల్లి పాత్రకి  డాడీస్ గర్ల్ ఫ్రెండ్ ‘టబు’ నే ఫిక్స్‌ చేశారని తాజా సమాచారం. నాగార్జున – టబు.. వీరిదొక హిట్ పెయిర్. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాతో ఈ జంట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
 Tabu to act as Akhil Akkineni`s mother
ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో కూడా నాగ్, టబులు భార్యాభర్తలుగా నటించారు. సిసింద్రీ సినిమాలో ఒక పాటలో మెరిసింది టబు. మరి నాగార్జునతో ఆ విధంగా హిట్ పెయిర్ గా నిలిచిన ఆమె ఇప్పుడు నాగ్ తనయుడు అఖిల్ కు తల్లిగా నటిస్తుండటం గమనార్హం.

 తల్లి పాత్రకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వలన, ‘టబు’ అయితే అతికినట్లు ఉంటుందని, సెంటిమెంట్ గా బావుంటుందని కూడా భావించి ఆమెను ఒప్పించారని అంటున్నారు.  అయితే కథకు కీలకమైన తల్లి పాత్రకు కొంత కొత్తదనాన్ని యాడ్ చేయడానికి విక్రమ్, నాగార్జునలు టబు ను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించ వలసి వుంది.
 Tabu to act as Akhil Akkineni`s mother
ఇక  నిలయ విద్వాంసుడు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా కోసం, “ఎక్కడ ఎక్కడ వుందో తారక” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కథానాయికగా “మేఘా ఆకాశ్’ పేరు వినిపిస్తుంది. మొదటి సినిమా ధారుణ పరాజయం పొందటంతో, అఖిల్ రెండో సినిమాపై నాగార్జున ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అందరికీ తెలిసిన విషయమే.
 Tabu to act as Akhil Akkineni`s motherఇదిలా ఉంటే..చాన్నాళ్లుగా బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు తరహా వేషాలకు వెనుకాడని టబు.. ఈ మధ్యనే తల్లి పాత్రలు కూడా చేస్తున్నారు. ‘హైదర్’ సినిమాలో షాహిద్ కపూర్ కు తల్లిగా నటించింది. ఈ క్రమంలో టాలీవుడ్ కు కూడా తల్లి పాత్రతో పున:పరిచయం అవుతోంది. నటిగా టబు ప్రతిభ గురించి కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. మరి అఖిల్ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో తల్లి పాత్రలు వెల్లువెత్తుతాయేమో చూడాలి.

- Advertisement -