ఏపీలో కూటమి సునామీ ముందు జగన్ తలవంచక తప్పలేదు. 175 స్థానాల్లో 155 చోట్ల టీడీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 52 సీట్లకుగాను వైసీపీకి ఏకంగా 49సీట్లురాగా, ఈసారి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. జగన్ సొంత జిల్లాలోనూ ఆరు చోట్ల వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. నాలుగు జిల్లాల్లో 40కిపైగా స్థానాల్లో కూటమి నేతలు లీడింగులో కొనసాగుతున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ లో 15వేలకుపైగా మెజార్టీలో లోకేశ్ కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురలేదు. 15సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లే. చివరిసారిగా 1985లో టీడీపీ ఇక్కడ గెలవగా లోకేష్ ఇప్పుడు మంగళగిరిని నిలబెట్టుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులకు షాక్ తగిలింది. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై టీడీపీ అభ్యర్థి గొండు శంకర్,నరసన్నపేట నుంచి బరిలో దిగిన వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ పై TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జగన్ కేబినెట్‌లోని మంత్రులందిరికి షాక్ తగిలింది. దాదాపు మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు.
Also Read:ఓటమి బాటలో ఏపీ మంత్రులు..