వేరుశనగలతో అద్భుత ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా ఉడికించిన వేరుశెనగలను తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. వేరుశెనగల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అనేక రకాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేరుశెనగలను ఉడకబెట్టి తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్, హృద్రోగ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉడకబెట్టుకుని తినే వేరుశెనగల్లో కెలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఊబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
వేరుశెనగలను ఉడకబెట్టి తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. వేరుశెనగల్లో పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడతాయి.
ఉడకబెట్టిన వేరుశెనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తాయి. దీంతో కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉండి బరువు తగ్గించేందుకు చాలా బాగా తోడ్పడుతాయి.
Also Read:బండి సరోజ్ కుమార్… ‘పరాక్రమం’