TTD:వైభవంగా వెంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు

16
- Advertisement -

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు సోమ‌వారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహ‌స్ర‌నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.

మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

మే 28వ‌ తేదీ మంగ‌ళ‌వారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

Also Read:బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌

- Advertisement -