మోడీ మళ్లీ సీఎం కావాలి ..నీతీశ్‌ నవ్వుల పాలు!

18
- Advertisement -

రాజకీయ నాయకుల ప్రసంగాల్లో పొరపాట్లు దొర్లడం సహజమే. అయితే వారు చేసే కామెంట్స్ వైరల్‌గా మారుతుంటాయి. అయితే తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం అలాంటి పొరపాటు కామెంట్స్ చేసి నవ్వుల పాలయ్యారు.

బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్..ఎన్నికల ప్రసంగంలో భాగంగా పొరపాటున మోడీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.మేం (ఎన్డీయే) దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో గెలవాలని, మోడీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.

దీంతో వెంటనే పక్కన ఉన్న నేతలు నితీష్‌ని అలర్ట్ చేయడంతో తన ప్రసంగాన్ని సరిచేసుకున్నారు.మోడీ మరోమారు ప్రధాని కావాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read Gold Price:లేటెస్ట్ ధరలివే

 

 

- Advertisement -