తెలంగాణ ఫైనల్ ఓటింగ్ శాతం ఇదే..

20
- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 66.3 శాతం ఓటింగ్ నమోదైందని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు. మొత్తం 2 కోట్ల 20 లక్షల 24 వేల 806 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 71 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. భువనగిరిలో అత్యధికంగా 76.78 శాతం పోలింగ్ నమోదుకాగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 48.48 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఆదిలాబాద్ 74.03 శాతం,పెద్దపల్లి 67.87 శాతం,కరీంనగర్ 72.54 శాతం, నిజామాబాద్ -71.92 వాతం, జహీరాబాద్ -74.63 శాతం,మెదక్ -75.09 శాతం,మల్కాజ్‌గిరి -50.78 శాతం,సికింద్రాబాద్ -49.04 శాతం,చేవెళ్ల -56.50 శాతం, మహబూబ్‌నగర్ -72.43 శాతం,నాగర్‌కర్నూల్ -69.46శాతం, నల్గొండ-74.02 శాతం,వరంగల్ -68.86 శాతం,మహబూబాబాద్-71.85 శాతం, ఖమ్మం -76.09 శాతం పోలింగ్ నమోదైంది.

Also Read:సలాడ్ తో ఎన్ని ఉపయోగాలో తెలుసా!

- Advertisement -