తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226 పోలింగ్ స్టేషన్లు, అత్యల్పంగా మహబూబాబాద్ లో 1,689 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ లో మొత్తం ఓటర్లు 3 కోట్ల 32 లక్షల 32,318 మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు.. 1,65,28,366,మహిళా ఓటర్లు.. 1,67,01,192 ఉన్నారు. మల్కాజిగిరి ఎంపీ స్థానంలో అత్యధికంగా 37, 80, 453 ఓటర్లు ఉండగా పెద్దపల్లి ఎంపీ స్థానంలో అత్యల్పంగా 15, 97, 892 ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 45మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అదిలాబాద్ నియోజకవర్గం బరిలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎన్నికల విధుల్లో 160 కంపెనీల సీఆర్ఫీఎఫ్ బలగాలు భద్రత నిర్వహిస్తుండగా 72 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఎన్నికల విధుల్లో 20 వేల ఇతర రాష్ట్రాల పోలీసులు ఉన్నారు.
Also Read:Harish:బీజేపీకి ఓటేస్తే నీళ్లు లేని బావిలో పడ్డట్లే