మళ్లీ తప్పు చేయం…కేసీఆర్ వెంటే!

11
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్డు షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 17 రోజుల పాటు బస్సుయాత్ర నిర్వహించిన కేసీఆర్ రోడ్డు షోలకు జనం నీరాజనం పట్టారు. రోడ్డు షోలతో గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొనగా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. రాష్ట్రమంతటా తిరిగిన కేసీఆర్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రోడ్డు సైడ్ టీ తాగడం, సామాన్యుల సమస్యలు తెలుసుకోవడంతో బీఆర్ఎస్‌కు మరింత మైలేజ్ రావాడానికి దోహదపడ్డాయి.

మహబూబాబాద్‌ రోడ్‌షో అనంతరం ఎన్నికల కమిషన్‌ విధించిన 48 గంటల విధించిన నిషేధం మినహా మిగతా షెడ్యూల్‌ అంతా యథావిధిగా కొనసాగింది. గత నెల 24న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు బయల్దేరిన కేసీఆర్‌ బస్సుయాత్ర శుక్రవారం సిద్దిపేటతో ముగిసింది. దీంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది.

నాడు – నేడు అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవారో, అలాగే ఇప్పుడు ఎలా ఉన్నారో ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్. రాష్ట్ర సాధన అనంతరం పదేండ్లపాటు దేశానికి మార్గదర్శనం చేసిన తెలంగాణ.. కేవలం ఐదు నెలల్లోనే ఆగమైన వైనాన్ని ప్రజలకు విడమరచి చెప్పారు.

ఇక తెలంగాణ అభివృద్ధే కాదు బీజేపీ, కాంగ్రెస్‌లతో రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు కేసీఆర్. బస్సుయాత్రల్లో కేసీఆర్‌ కనిపించగానే జై కేసీఆర్‌ అని అంతా నినదించారు. ఏ రోడ్డు షో చూసిన ఇసుక వేస్తే రాలనంత జనం. ముఖ్యంగా యూత్‌ నుండి బీఆర్ఎస్ సభలకు మంచి స్పందన వచ్చింది. ఒకసారి తప్పు చేశాం…మళ్లీ ఆ తప్పు చేయం…సార్ వెంటే ఉంటామని ప్రజలు నిర్మోహమాటంగా చెప్పే పరిస్థితి నెలకొంది. మొత్తంగా కేసీఆర్ రోడ్డు షోలతో బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Also Read:KCR:బీఆర్ఎస్ గెలిస్తేనే గోదావరి జలాలు

- Advertisement -