Harishrao:కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకుదాం

20
- Advertisement -

రేపు పురిటి గడ్డసిద్దిపేట కు… గులాబీ దళపతి…కేసీఆర్ రానున్నారని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యమ గడ్డ కు… గులాబీ జెండా కు పునాది వేసిన గడ్డ సిద్దిపేట అని…కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. సిద్దిపేట లో రేపు రోడ్ షో.. కర్నర్ మీటింగ్ లో పాల్గొననున్న తెలంగాణ తొలి సీఎం బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ పాల్గొంటారని చెప్పారు.

సాయంత్రం 7గంటలకు సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్ షో ఉండనుందని, గంటన్నర పాటు పట్టణ ప్రధాన రహదారి వెంబడి గులాబీ దళపతి రోడ్ షో సాగుతుందన్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొంటారన్నారు. సిద్దిపేట కలలను సాకారం చేసిన కారణజన్మునికి ఘనంగా స్వాగతం పలకాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Also Read:గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి..న్యూ రిలీజ్ డేట్

- Advertisement -