తెలంగాణలో RR ట్యాక్స్‌పై సెటైర్లు వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేసిన వసూళ్ల కంటే RR ట్యాక్స్ ఎక్కువని మండిపడ్డారు మోడీ. వేముల వాడలో మాట్లాడిన మోడీ.. తెలుగు భాషలో ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే చిత్రం రిలీజైందని, అయితే ఆ చిత్ర పెద్ద హిట్ అయ్యిందని, ఆ చిత్రం చేసిన కలెక్షన్ల కన్నా..ఆర్ఆర్ ఎక్కువ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపించారు.
వెయ్యి కోట్ల మొత్తాన్ని కొన్ని రోజుల్లోనే ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా రాబట్టారని ఎద్దేవా చేయగా ఆర్ఆర్ ట్యాక్స్‌ను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్‌గా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read:సందీప్ కిషన్…’మాయవన్’
ఆర్ఆర్ నుంచి తెలంగాణను విముక్తి చేయాలన్నారు. అంబానీ, అదానీని ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆపేసింది. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఎంఐఎంను గెలిపించడానికి కాంగ్రెస్ కష్టపడుతోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఓబీసీలకు నష్టం. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.