- Advertisement -
వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుండి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుండగా ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా 25 రోజులు మాత్రమే సమయం ఉంది.
అయితే ఈ టోర్నమెంట్‌కు ఉగ్రవాదుల నుండి బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఉగ్రదాడి బెదిరింపుల నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.
ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రపంచకప్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతే మా తొలి ప్రాధాన్యత. ఇందు కోసం కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం అని వెల్లడించారు.
Also Read:‘భలే ఉన్నాడే’పై మారుతి ప్రశంసలు
- Advertisement -