బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ బృహత్తర కార్యక్రమంలో సినీ,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే గ్రీన్ ఛాలెంజ్‌లో ఇప్పటికే పలు ఫారెస్ట్‌లను దత్తత తీసుకోగా తాజాగా మరో ముందడుగు పడింది.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సుస్థిరత దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోందని ఇవాళ వృక్ష వేద్ అరణ్య అటవీ ప్రాజెక్ట్‌ను #ForestManOfIndia, పద్మశ్రీ జాదవ్‌తో కలిసి గ్రీన్ ఇండియా సభ్యులు ప్రారంభిస్తున్నారి చెప్పారు. అస్సాంలోని మొలాయి కథోని ఫారెస్ట్‌లో 10,000 మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంలో మరో ముందడుగు పడిందని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపారు సంతోష్.
#GreenIndiaChallenge excited to embarks on a monumental journey towards sustainability! Today Launching “Vriksha Ved Aranya” afforestation project with the legendary #ForestManOfIndia, Padma Shri #JadavPayeng ji along with our #GIC team members, Planting 10,000 saplings in Molai… pic.twitter.com/qCOHDoYqiY
— Santosh Kumar J (@SantoshKumarBRS) May 2, 2024
Also Read:KCR:రేవంత్‌పై చర్యలేవి?