- Advertisement -
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజులు బ్రేక్ పడింది. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఎన్నికల కమిషన్. ఇటీవల ప్రచారంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులు రావడంతో.. ఈసీ చర్యలు తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తించనుంది.
వాస్తవానికి కేసీఆర్ ఎన్నికల ప్రచారం, రోడ్ షోలకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి గులాబీ అధినేతకు స్వాగతం పలుకుతున్నారు. ఇక కేసీఆర్ రోడ్ షోలకు బహిరంగసభలను తలపించేలా ప్రజలు తరలివస్తుండగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Also Read:నవీన్ చంద్రకు అరుదైన గౌరవం..
- Advertisement -