తిరుమల శ్రీవారి ఆలయంలో మే 3 నుండి 21వ తేదీ వరకు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగనుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే 12వ తేదీన భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు.
16-05-2024 : రాత్రి ద్వాజారోహణం మరియు పెద్ద శేష వాహనం
17-05-2024: ఉదయం చిన్న శేష వాహనం మరియు రాత్రి హంస వాహనం
18-05-2024 : సింహ వాహనం మరియు ముత్యపు పందిరి వాహనం
19-05-2024 : కల్పవృక్ష వాహనం మరియు సర్వ భూపాల వాహనం
20-05-2024 :మోహినీ అవతారం మరియు గరుడ వాహనం
21-05-2024 : హనుమంత వాహనం మరియు గజ వాహనం
22-05-2024 : సూర్య ప్రభ వాహనం & చంద్ర ప్రభ వాహనం
23-05-2024 : రథోత్సవం మరియు అశ్వ వాహనం
24-05-2024 :చక్ర స్నానం మరియు ద్వజావరోహణం
Also Read:KCR:12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు