దేవరలో అల్లరి నరేష్..క్లారిటీ!

21
- Advertisement -

మాన్‌ ఆఫ్‌ మాసెస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కీ రోల్‌ చేస్తున్నారు.

రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్స్ కలిసి ఈ సినిమాను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నారు.

ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా అల్లరి నరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు రాగా దీనిపై స్పందించారు నరేష్‌. దేవర సినిమాలో తాను ఏ పాత్రలో నటించడం లేదు. నేను నటిస్తున్నాను అని వచ్చిన వార్త రూమర్‌ మాత్రమేనని తేల్చిచెప్పారు. ఒక వేళ నాకు ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను తెలిపారు.

Also Read:డయాబెటిస్ ఉన్నవాళ్ళు వీటిని తింటే డేంజర్!

- Advertisement -