గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చామన్నారు ఏపీ సీఎం జగన్.2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంధవ, బైబిల్,ఖురాన్ అన్నారు. గత ఎన్నికల్లో నవరత్నాలతో వచ్చిన జగన్…ఈసారి అలాంటి హామీలనే ప్రకటించారు.
అమ్మఒడి, ట్యాబ్ లు, విద్యా కానుక, గోరుమద్ద,ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లీనిక్ లు, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలు చేస్తామన్నారు.రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9గంటల విద్యుత్, సమయానికే ఇన్ ఫుట్ సబ్సిడీ ఇస్తామని తేల్చిచెప్పారు.
జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరింయంటెడ్ కర్కియంలో మార్పులు,నాడు – నేడు స్కూళ్లు, ఆస్పత్రులు పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. అక్కచెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు, ఇళ్లు అందిస్తామని, మహిళా సాధికారత,చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ సామాజిక భద్రత వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. పెన్షన్ కానుక, రెండు విడతల్లో 3,500కు పెంచుతామని.. ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తామని తెలిపారు.
Also Read:KTR:పాలమూరులో ఓటమి దిశగా కాంగ్రెస్