Pocharam:అబద్దాల కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు

21
- Advertisement -

కాంగ్రెస్ చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమాన్ నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడిన పోచారం…ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతార‌న్నారు.

బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రనికి చేసింది ఏమీలేదు. పదేళ్లుగా విభజన హామీలను బీజేపీ నేర్చలేదన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుందన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కేసీఆర్‌కు తెలిసినట్టు ఎవరికి తెలియదని…. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి వంచించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు.

Also Read:ఎలన్ మస్క్..ఇండియా ట్రిప్ రద్దు

- Advertisement -