కేసీఆర్ బస్సుయాత్ర..ఈసీని కలిసిన కేతిరెడ్డి

38
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి వర్యులు,ప్రధాన ప్రతిపక్ష నేత, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ టూర్ ప్రోగ్రామ్ కు సంబంధించి పార్టీ ప్రతినిధిగా ఎన్నికల కమిషన్ ను కలిశారు బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి. లోక సభ ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 22నుండి మే 10వ తేది వరకు జరగబోయే కేసీఆర్ యాత్ర వివరాల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్నికల సందర్భంగా అధికారులందరూ ఈసి పరిధిలోకి వస్తారు కాబట్టి యాత్రకు సంబంధించి తగు భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రలో పోలీసు సహకారం అందేలా ఆదేశాలు ఇవ్వాలని..సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి వాటిపై ఈసి ప్రత్యెక దృష్టి పెట్టాలని.. అవసరమైతే కేంద్ర బలగాలను మొహరించాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.

యాత్రలో మా నాయకుడు కేసీఆర్ గారు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఒక భరోసాను ఇస్తారని..రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు,పేరుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టిన ఎక్కడ కొనట్లేదు. రోజుల తరబడి రైతులు వేచి చూస్తున్నారు.రైతులకు పండించిన పంటలకు ఎమ్మెస్పి ధర కే కొనాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటాలు ఒట్టి మాటలే అయ్యాయి.అగ్గువ ధరకే రైతులు ధాన్యాన్ని అమ్ముతున్నారు…ఇస్తానన్న 500/- బొనస్ లేదు అన్నారు.

అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేక పోయిందన్నారు. కాంగ్రెస్ 4నెలల కాలంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని…జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లతో తెలంగాణ కు నష్టమే..ప్రజల పక్షాన నిలబడే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే లోకసభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

Also Read:కడియంకు సవాల్ విసిరిన రాజయ్య..

- Advertisement -