కూకట్‌పల్లిలో కేటీఆర్…సిద్దిపేటలో హరీశ్

25
- Advertisement -

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లిలోని ప్రముఖ, ప్రాచీన రామాలయంలో జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవములో పాల్గొన్నారు.కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు.

సిద్దిపేట నియోజకవర్గం లోని చిన్నకోడూర్ మండలం కస్తూరి పల్లి గ్రామం లో నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమం, ఇబ్రహీంనగర్ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం లో పాల్గొన్నారు హరీశ్‌ రావు. ఈ సందర్భంగా స్వామి వారికీ ప్రత్యేక పూజలు చేశారు.మాచాపూర్ గ్రామం లో శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా శ్రీ రామలింగేశ్వర ఆలయం లో జరిగే కళ్యానోత్సవం లో పాల్గొన్నారు.

Also Read:KTR:సివిల్స్ విజేతలకు అభినందనలు

- Advertisement -