మన శరీరంలోని అవయవాలలో కాలేయం ఎంతో ముఖ్యమైనది. రక్తాన్ని శుద్ధి చేసి శరీర భాగాలన్నిటికి సరఫరా చేయడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా మనం తిన్న ఆహారంలోని ప్రోటీన్స్, విటమిన్స్ శరీర భాగాలకు చేరవేయడం కూడా లివర్ చేసే పనే. ఇలా దాదాపు 400కు పైగా పనులను లివర్ చేస్తుంది. మరి ఇంతటి ముఖ్యమైన అవయవం డ్యామేజ్ అయితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కావు. బలహీనంగా తయారవడం, పొత్తి కడుపులో నొప్పి, విపరీతమైన అలసట, మూత్ర విసర్జనలో మార్పులు, ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ లక్షణాలను బట్టి డాక్టర్ ను సంప్రదించినప్పుడు మాత్రమే లివర్ దెబ్బతిన్న విషయం తెలుస్తుంది. అయితే ఇవి మాత్రమే కాకుండా మన శరీరంలో వచ్చే కొన్ని మార్పులు లివర్ దెబ్బ తిన్న విషయాన్ని ముందే తెలియజేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .
సాధారణంగా లివర్ పనితీరు మందగించినప్పుడు శరీరంలోపల వచ్చే మార్పుల తో పాటు భాహ్య శరీరంపై కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా కాళ్ళలో వాపు లివర్ డ్యామేజ్ కు సంకేతమే అంటున్నారు నిపుణులు. పాదాలు, అరికాళ్ళు, చీలమండ ఉబ్బుగా కనిపించడం,అరికాళ్ళలో నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు లివర్ ఫెయిల్ లక్షణాలలో భాగమట. హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి ఉన్నవారిలో కూడా లివర్ సమస్యలు ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సందర్భాల్లో పచ్చ కామెర్ల వ్యాధి కూడా లిఫర్ ఫెయిల్ కు సంకేతమేనట. ఇంకా డయాబెటిస్ వ్యాధి గ్రస్తులలో పాదాలలో జలదరింపు, తిమ్మిరి వంటి లక్షణాలు కూడా లివర్ డ్యామేజ్ అయిందనడానికి సంకేతాలే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి లివర్ విషయంలో పైనా చెప్పబడిన ఎలాంటి లక్షణాలు కనిపించిన వైద్యులను సంప్రదించడం ఎంతో మేలు.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..