పవన్ తను పోటీ చేసే స్థానం విషయంలో తప్పు చేశారా ? భీమవరం కాదని పిఠాపురం ఎంచుకోవడం పవన్ అవివేకమా ? అంటే అవుననే అంటున్నారు ఇటీవల పార్టీ మారిన పోతిన మహేశ్. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ మహేశ్ జనసేన వీడి వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. పవన్ కు విజన్ లేదని, కేవలం చంద్రబాబు కోసమే జనసేన పార్టీని నడిపిస్తున్నారని పోతిన మహేశ్ విమర్శించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి పవన్ పోటీ చేసే స్థానం విషయంలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశం అవుతున్నాయి. జనసేన బలంగా ఉన్న భీమవరం కాదని పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటని పోతిన మహేశ్ ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడా ఆయన మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తారని భావించరంతా. ఆయన కూడా భీమవరం వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. భీమవరంలో టీడీపీ చెప్పుకోదగ్గ స్థాయిలో బలంగా లేదు. ఇక్కడ పోటీ జనసేన వైసీపీ మద్యనే కొనసాగనుంది. కానీ పిఠాపురంలో అలా కాదు. అక్కడ వైసీపీతో పాటు టీడీపీ కూడా బలంగానే ఉంది. మరి జనసేన బలంగా ఉన్న భీమవరాన్ని టీడీపీకి కట్టబెట్టి, బలం లేని పిఠాపురం సీటు పవన్ ఎంచుకోవడం చంద్రబాబు కోసం కాదా ? అంటూ పోతిన మహేశ్ ప్రశ్నించారు.
పవన్ లో ఉన్న ఈ అస్థిరత్వం కారణంగానే జనసేన పార్టీ బలహీనంగా ఉందని మహేశ్ చెప్పుకొచ్చారు. భీమవరంలో కాపు ఓటు బ్యాంకుతో పాటు జనసేన పార్టీ ప్రభావం కూడా ఎక్కువ. అందువల్ల ఈసారి కూడా పవన్ ఇక్కడి నుంచే పోటీ చేసి ఉంటే కచ్చితంగా గెలిచే వారనేది కొందరి అభిప్రాయం. పైగా గత ఎన్నికల్లో ఓటమి కారణంగా ఈసారి సానుభూతి కలిసొచ్చి పవన్ కు ఘనవిజయం దక్కేది. కానీ పవన్ డైరెక్షన్ మార్చుకొని పిఠాపురం వైపు వెళ్ళడం వల్ల రెండు చోట్ల నష్టపోక తప్పదని పవన్ చేసిన తప్పు ఇదేనని కొందరు చెబుతున్నారు. మరి పవన్ కు ఈసారి ఎలాంటి రిజల్ట్ అందుతుందో చూడాలి.
Also Read:Revanth:రేవంత్ కు ‘భయం’ పట్టుకుందా?