పుష్ప 2..టీవీ పార్ట్ నర్ ఫిక్స్!

31
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.

ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానుండగా తాజాగా ఈ సినిమా టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ అయ్యారు. మొదటి పార్ట్ ను దక్కించుకున్న ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా, పుష్ప 2 ది రూల్ ను కూడా కొనుగోలు చేసింది.

థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ సినిమా టీవీ ప్రీమియర్ గా స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్‌తో పునకాలు తెప్పించారు బన్నీ. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read:పవన్, చంద్రబాబు..ఉమ్మడి ప్రచారం?

- Advertisement -