ఈ పండ్లు తింటే.. నో డీహైడ్రేషన్!

23
- Advertisement -

రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రత్తలు రెట్టింపు అవుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా బయటకు రావడానికి భయపడి పోతున్నారు ప్రజలు. ఎండలో పని చేసే వారి పరిస్థితి మరి దారుణం.. ఎండ తాకిడికి వడదెబ్బ బారిన పడడం లేదా డీహైడ్రేషన్ కారణంగా అనారోగ్యానికి లోనవడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ వేసవికాలంలో ఇంట్లో ఉన్న లేదా బయట ఉన్నా డీహైడ్రేషన్ మాత్రం అందరినీ వేధిస్తుంది. దీని నుంచి బయట పడడానికి నీరు సమృద్దిగా తాగాలి. నీటితో పాటు శరీరానికి అవసరమయ్యే మినరల్స్ అందించే పదార్థాలు లేదా పండ్లు తినడం ఎంతో మంచిది. మరి ఈ వేసవిలో డీహైడ్రేషన్ బారినుంచి తప్పించే పండ్లు ఏవో చూద్దామా !

నారింజ పండు

విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ పండులో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోదక శక్తిని పెంచి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయ పడుతుంది. ఇంకా నీరసం, అలసట, బద్దకం వంటి సమస్యలను దూరం చేసి శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతుంది.

పుచ్చకాయ

ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. వేసవిలో అత్యంత విరివిగా ఈ పండు లభిస్తుంటాయి. శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఈ పండ్లు ఎంతగానో సహాయ పడతాయి. ఇందులో ఉండే మినరల్స్, మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయ పడతాయి.

స్ట్రాబెర్రి

స్ట్రాబెర్రి కూడా వేసవిలో తప్పనిసరిగా తినదగిన పండ్లలో ఒకటని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు జీర్ణ శక్తిని పెంచడం, మెదడు పని తీరును మెరుగుపరచడం చేస్తుంది.

Also Read:తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల..

కీరదోస

వేసవిలో కీరదోస తినడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. ఎందుకంటే కీరదోసలో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే ఇందులోని పోషకాలు డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి.

వీటితో పాటు ఫైనాఫిల్, కర్బూజ వంటి పండ్లు కూడా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -