ఏపీలో ఎలక్షన్ హీట్ మామూలుగా లేదు. ప్రధాన పార్టీల అధినేతలు వాడి వేడి విమర్శలతో పోలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇటు వైఎస్ జగన్ అటు చంద్రబాబు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు కొత్త చర్చలకు తావిస్తున్నాయి. ఎన్నికల తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్ళక తప్పదని, మిగిలిన జీవితం అంతా ఆయన జైల్లోనే గడపాల్సి ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటు టీడీపీ శ్రేణులు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలు పూర్తవ్వగానే మరోసారి జైలుకు వెళ్ళేందుకు జగన్ సిద్దంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు జైలు అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి కారణం కూడా లేకపోలేదు. .
2014 తర్వాత చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై వైసీపీ సర్కార్ అడపా దడపా విచారణ చేస్తూనే ఉంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అమరావతి రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కామ్.. ఇలా చాలా స్కామ్ లనే తెరపైకి తెచ్చింది. స్కిల్ స్కామ్ లో భాగంగా బాబు కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడపాల్సివచ్చింది. ఆ తరువాత బెయిల్ పై బాబు బయటకు రావడంతో ఆ అంశం కాస్త ఫెడ్ అవుట్ అయిపోయింది. అయితే ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలిస్తే బాబుపై ఉన్న కేసుల అంశాన్ని జగన్ బయటకు తీసే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.
ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే జగన్ జైలుకు పంపించే దిశగా చంద్రబాబు కూడా గట్టి ప్రణాళికలు వేసే అవకాశం లేదు. జగన్ పాలనలో అవినీతి, ఇసుక కుంభకోణం, మద్యం కుంబకోణం.. ఇలా చాలా అంశాలనే టీడీపీ ప్రశ్నిస్తోంది. వీటన్నిటిపై చంద్రబాబు విచారణకు అధెశించే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల తర్వాత జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని చంద్రబాబు ఇప్పటికే పదే పదే నొక్కి చెబుతున్నారు. ఇలా ఇద్దరు అధినేతలు కూడా ఒకరిపై ఒకరు జైలు దిశగా ప్రణాళికలు రచిస్తుండడంతో ఎన్నికల తరువాత ఎవరో ఒకరు జైలుకు వెళ్ళడం మాత్రం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:ఉడకబెట్టిన శనగలు తినడం మంచిదే.. కానీ!