IPL 2024:అభి’షేక్’.. సేహ్వాగ్ అవుతాడా?

36
- Advertisement -

సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో అందరి దృష్టి ఆకట్టుకుంటున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తున్నాడు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 19 బంతుల్లో 32 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లలో కూడా 63(23 బంతుల్లో ), 29 (20 బంతుల్లో), 37 (12 బంతుల్లో).. మెరుపు ఇన్నింగ్స్ తో అభిమానులను అలరిస్తున్నాడు. అయితే ఓపెనర్ గా లేదా మూడో బ్యాట్స్ మెన్ గా వచ్చే అభిషేక్ శర్మ టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ను గుర్తు చేస్తున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బౌలర్ ఎవరైనా, ఎలాంటి బంతి అయిన ఈజీగా బౌండరీలో తరలిస్తూ సెహ్వాగ్ వారసుడిగా అభిషేక్ శర్మ నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి అభిషేక్ శర్మ.. ఇలాగే అడితే త్వరలోనే టీమిండియా తరుపున ఆరంగేట్రం చేసే అవకాశం ఉంది.

చెన్నై చిత్తు
చెన్నై హైదరాబాద్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దూబే (45), రహనే (35), జడేజా (31).. మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరు రాణించలేకపోయారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అభిషేక్ శర్మ (37), మర్క్రమ్ (50), హెడ్ (31) చెలరేగడంతో ఎస్‌ఆర్‌హెచ్ సులువుగా లక్ష్యాన్ని చేధించింది.

నేటి మ్యాచులు
నేడు జరిగే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఒకవైపు వరుస విజయాలతో ఆర్ఆర్ దూకుడు మీద ఉండగా.. మరోవైపు పరాజయాలతో ఆర్సీబీ సతమతమవుతోంది. దాంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది.

Also Read:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో అశోక్ గల్లా

- Advertisement -