పుష్ప -2..రష్మికా బర్త్ డే గిఫ్ట్

21
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి. అయితే పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీ‌వ‌ల్లిగా న‌టించి త‌న న‌ట‌న‌తో అంద‌ర్ని అల‌రించి నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిపోయిన ర‌ష్మిక మంద‌న్న పాత్ర పుష్ప‌-2 ది రూల్‌లో త‌న‌దైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకోబోతుంది. ఈ రోజు ర‌ష్మిక మంద‌న్న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుష్ప -2లో ఆమె పాత్ర గెట‌ప్‌ను రివీల్ చేస్తూ ఓ స్ట‌నింగ్ పోస్ట‌ర్‌ను వ‌దిలారు మేక‌ర్స్‌.

ఈ పోస్ట‌ర్ చూసిన వాళ్లంతా ర‌ష్మిక ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించ‌బోతుంద‌ని అంటున్నారు. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

Also Read:ప్రధాని సీటుపై కాంగ్రెస్..మాస్టర్ ప్లాన్!

- Advertisement -