రాజన్న సిరిసిల్ల జిల్లా, చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీళ్లందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చెడొద్దు. మనం ఎన్నికలు అయినంక ఓ పదివేల మంది రైతులం మేడిగడ్డ పోదాం. అక్కడ నుంచి నీళ్లు మన పంట పొలాలకు ఎట్లా రావో సూద్దాం. మీరు పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు.
ఎండిపోయిన వరిపైరుని చూపిస్తూ తమ గోడును మొరపెట్టుకున్నారు రైతులు. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎన్నికల తర్వాత మేడిగడ్డకు 10వేల మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని.. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం శాభాష్‌పల్లి వద్ద మధ్య మానేరు జలాశయాన్ని పరిశీలించారు.
తొలుత కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్ధుంపూర్‌లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా చెప్పారు.
Also Read:KCR:రైతులకు అండగా బీఆర్ఎస్