రూ.450కే సిలిండర్..కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే

24
- Advertisement -

దేశ వ్యాప్తంగా రూ.450కే సిలిండర్ అందిస్తామని కాంగ్రెస్ ప్రజలకు వాగ్దానం చేసింది. న్యాయ్ పత్ర పేరుతో 25 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. అగ్నివీర్ స్కీమ్ రద్దు, సీఏఏను తొలగిస్తాం వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చారు.

ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి విడుదల చేశారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఉద్యోగాలు, సంపద సృష్టి, సంక్షేమం ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించారు. ఆర్మీలో అమలులోకి మళ్లీ పాత రిక్రూట్మెంట్ స్కీమ్,రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ,పేద మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం,ఉపాధి హామీ వేతనం రూ. 400,రైతులకు రుణమాఫీ వంటివి ఉన్నాయి.

పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత,5 వేల కోట్ల రూపాయలతో యువత కోసం ప్రత్యేక నిధి,కులగణన ఆధారంగా రిజర్వేషన్‌లు అమలు,ప్రభుత్వ పరీక్షలు, ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు ఫీజుల రద్దు,పీఎంఎల్ఏ, సీఏఏ రద్దు,ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లు,ఐపీసీ, సీఆర్సీపీ ఎవిడెన్స్ ,చట్టాల రద్దు,రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్,విద్యా రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు,వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ రద్దు వంటివి ఉన్నాయి.

Also Read:ఫ్యామిలీ స్టార్..ట్విట్టర్ రివ్యూ

- Advertisement -