రాబోయే ఎన్నికలతో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనేది ప్రస్తుతం మోస్ట్ ఇంటరెస్టింగ్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. మరోసారి తామే అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతుంటే.. ఈసారి కూటమిదే అధికారం అని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు చెబుతున్నాయి.ఈ రెండు వర్గాలు కూడా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉండడంతో అధికారం ఎవరిది అనే అంశాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం ఎన్నో సర్వేలు ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఇరు పార్టీలకు సమాన రీతిలోనే సర్వేల ఫలితాలు తరసా పడుతున్నాయి. దీంతో ఈసారి ఏపీ ఎన్నికలు ఎన్నడూలేని విధంగా రంజుగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపోతే తాజాగా ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్ సర్వే ఫలితాల టీడీపీ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన బీజేపీ కూటమి 17 కు పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని, వైసీపీ 8 స్థానాలకే పరిమితం అవుతుందని మూడ్ ఆఫ్ నేషన్ సర్వే వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమిదే పై చేయి ఉంటుందని చెప్పిన ఆ సర్వే ఫలితాలను టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ గా మారింది.
గత ఎన్నికల్లో వైసీపీ 22 సీట్లు గెలుచుకోగా టీడీపీ 3 సీట్లకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి టీడీపీకి మద్దతుగా జనసేన బీజేపీ పార్టీలు నిలవడంతో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఎన్నికల సమయానికి ఓటర్ల అభిప్రాయాలలో ఎంతో కొంత మార్పులు సంభవించినప్పటికి మెజారిటీ సీట్లను ఈసారి కూటమే కైవసం చేసుకుంటుందని టీడీపీ అధిష్టానం ధీమాగా ఉంది. అటు వైసీపీ ఈసారి 25 ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేస్తామని ఘంటాపథంగా చెబుతోంది. విజయంపై ఇరు పక్షాలు ధీమాగా ఉండడంతో అధికారం విషయంలో సర్వేలను బట్టి ఓ అంచనాకు రాలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read:TTD:సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం