లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలలో నేతలు ఇటునుంచి అటు.. అటునుంచి ఇటు అన్నట్లుగా పార్టీలు మారుతుండడం, ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పిరాయింపులకు పాల్పడుతుండడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కాగా ఎన్నికల ముందు నేతలు పార్టీలు మారడం సహజమే. కానీ డబ్బు, హోదా, పదవి వంటివి ఆశ చూపి ప్రలోభలకు గురి చేసి నేతలను పార్టీలోకి లాక్కోవడం ఈ మద్య కాలంలో మరి ఎక్కువైందనే వాదన వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ తరహా రాజకీయాలకు తెర తీస్తున్నాయి. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల బెదిరింపులతో ఇప్పటికే బీజేపీ ఎంతో మంచి నేతలను పార్టీలో కలిపేసుకుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బిఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నేతలు కడియం శ్రీహరి, కేకే వంటి వారు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వీరిద్దరు అనూహ్యంగా పార్టీ మారడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం ముమ్మాటికి రాజ్యంగ విరుద్దమేనని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ వ్యాఖ్యానించారు. వీరిద్దరి విషయంలో హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామని కూడా చెప్పుకొచ్చారు కేటిఆర్. దీంతో పార్టీ పిరాయింపుల కారణంగా వీరిద్దరిపై ఏ మాత్రం అనర్హత వేటు పడిన రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరగడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:Harishrao:రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారు?