రెండు జంటల మధ్య ప్రేమకథల్లో అసలు సిసలు సరిగమలేంటో వెండితెరపై చూడాలంటున్నారు నిర్మాత కాకర్ల నాగమణి. కాకర్ల రాహుల్, శ్వేత సమర్పణలో శ్రీ కోట శక్తి క్రియేషన్స్ బ్యానర్‌పై జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మించిన చిత్రం `వెక్కిరింత`. కాకర్ల, నాని(శ్రీధర్), వినీత్, ప్రేయసి నాయక్, మౌనిక రెడ్డి ప్రధాన తారాగణం. చంద్రలేఖ, భానుప్రసాద్.జె సంగీతం అందించారు.
వెక్కిరింత టైటిల్ కి తగ్గట్టే విభిన్నమైన చిత్రం. ఈ ఏడాది చిన్న చిత్రాలకు మంచి ఆదరణ బావుంది. ఆ కోవలోనే పెద్ద విజయం సాధించే చిత్రమిదని నిర్మాత అన్నారు. సినిమాకి అన్నీ బాగా కుదిరాయి. ఇద్దరమ్మాయిలు.. ముగ్గురబ్బాయిలు.. రెండు ప్రేమకథలు .. ఇదే మా సినిమాలోని అసలు ట్విస్ట్. మంచి మ్యూజిక్ కుదిరింది. జూన్ 2న ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రానికి , సాహిత్యం: మనాశ్రీ, ఎస్.కె.షాహి, ఎడిటర్ః నాగార్జున.ఎం, సంగీతం: చంద్రలేఖ, కెమెరాః వాసిరెడ్డి సత్యానంద్, భానుప్రసాద్.జె, డైలాగ్స్: సాయి రామకృష్ణ, నిర్మాత: కాకర్ల నాగమణి, కథ, దర్శకత్వం: జంగాల నాగబాబు.