క్రికెటర్‌ సెక్స్‌ వీడియో లీక్‌..!

263
- Advertisement -

స‌న‌త్‌ జయసూర్య..శ్రీలంక మాజీ డాషింగ్‌ ఓపెనర్‌, కెప్టెన్‌.  ఇప్పుడీ ఈ మాజీ క్రికెటర్‌ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. తన మాజీ ప్రేయసితో సన్నిహితంగా ఉన్న శృంగార వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోని జయసూర్యే సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. క్రికెటర్‌గా ఉన్న సమయంలో జయసూర్యకు ఆమెతో పరిచయం ఏర్పడింది. కొద్దికాలం తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ మానసికంగా, భౌతికంగానూ దగ్గరయ్యారు.
Jayasuriyas private video is leaked
అయితే, కొన్ని విభేదాలతో ఒకరికొకరు దూరమయ్యారు. జయసూర్య నుంచి విడిపోయిన ఆమె ఓ బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు శ్రీలంకలో మీడియా సంస్ధకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ప్రతీకారంతోనే జయసూర్య స్వయంగా ఆ వీడియోని లీక్‌ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌  అయింది. శుక్రవారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో ప్రసారమవడంతో ఒక్కసారిగా షాక్‌ అయిన ఆమె ..శ్రీలంక జాతీయ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌లో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిపోయింది. అయితే  ప్రతీకారంతోనే జయసూర్య ఆ విధంగా చేశాడని ఆమె తన స్నేహితులవద్ద వాపోయింది.
Jayasuriyas private video is leaked
తామిద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ వీడియో తీశాడని,  జయసూర్య తన భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకపోవడంతో తాము ఓ గుడిలో నిశ్చితార్థం చేసుకున్నామని వెల్లడించింది. ఈ విషయమై జయసూర్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అతడు అందుబాటులోకి రాలేదని, ఇదిలాఉండగా శుక్రవారం ఉదయం నుంచి తమ కార్యాలయానికి ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కట్‌ చేశారని జయసూర్య మాజీ ప్రేయసి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఉద్యోగులందరూ సెల్‌ఫోన్లలో ఆ వీడియోను చూశారని తెలిపాయి.  ఇక ఇదిలాఉంటే..శుక్రవారం విధుల్లో ఉన్న ఆ కార్యాలయ ఉద్యోగుల మొబైల్‌ ఫోన్లను యాజమాన్యం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా  ఈ వీడియోను ఎవరు లీక్‌ చేశారనే విషయాన్ని కనిపెట్టేందుకు శ్రీలంక జాతీయ సైబర్‌ సెక్యూరిటీ కేంద్రం ప్రయత్నిస్తోంది.

- Advertisement -