‘ఒక మనసు’ ద్వారా నాగబాబు కూతురు నిహారిక తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అందం .. అభినయం పరంగా నిహారికకు మంచి మార్కులు పడ్డాయి. అప్పటి నుంచి కూడా ఆమె తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఒక సినిమాను అంగీకరించినట్టు తెలుస్తోంది.
ఏ మూవీకి అయినా హీరో-హీరోయిన్ కాంబినేషన్స్ ముఖ్యం. ప్రధాన పాత్రల మధ్య పండే కెమిస్ట్రీ.. మూవీని నిలబెడుతుంది. ఇక ప్రేమ కథా చిత్రాలకు అయితే.. ఈ కాంబినేషన్ అత్యంత ప్రధానమైన విషయం. హీరో-హీరోయిన్స్ కాంబో రిపీట్ చేసి కొందరు దర్శకులు సక్సెస్ కొడితే.. మరికొందరు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ నెస్ అందించేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే గతంలో నారా రోహిత్ కథానాయకుడిగా పవన్ సాదినేని ‘సావిత్రి’ అనే ఒక సినిమా చేశాడు. పవన్ సాదినేని నారా రోహిత్ హీరోగా మరో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక నిహారిక అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. నారా రోహిత్ నీహారిక కొణిదెల.. ఈ కాంబినేషన్ వింటేనే బోలెడంత ఆసక్తి కలుగుతోంది. ఇప్పటికైతే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. త్వరలో మిగిలిన క్యాస్టింగ్ కు కూడా ఫైనల్ చేసి అప్పుడు మూవీ అనౌన్స్ మెంట్ చేయనున్నారని తెలుస్తోంది.