ఏం ప్రభాస్ రాజు గారు.. అని పిలిస్తే !

176
rajamouli talks about prabhas
rajamouli talks about prabhas
- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందటమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటారు రాజమౌళి. బాహుబలిలో మొదటగా శివగామి పాత్రకు శ్రీదేవిని అనుకున్నామని రాజమౌళి చెప్పగా.. ప్రభాస్ మాత్రం శ్రీదేవి ముందు మనం కనపడతామా అని అనేవాడని చెప్పారు. రాజమౌళీ మాటల్లోనే ‘డార్లింగ్.. ఈమె ఉంటే ఇంకేమైనా ఉందా..? మనం కనపడతామా..? ఆమె ముందు ప్రేక్షకులకు మనం ఆనతామా..? అమ్మో మనం చాలా హోమ్‌వర్క్ చేయాలి డార్లింగ్.. తినేస్తుంది.. అందర్నీ తినేస్తుంది..’ అని ప్రభాస్ మాటిమాటికీ అనేవాడని అన్నారు రాజమౌళి. అయితే తమ అదృష్టం బాగుండి శ్రీదేవి ఈ పాత్రను ఒప్పుకోలేదన్నారు. బాహుబలి షూటింగ్ సంధర్బంగా తాము ప్రభాస్‌ను ఆటపట్టించడానికి ‘ ఏం ప్రభాస్ రాజు గారు’.. అని పిలిస్తే తెగ ఇబ్బంది పడిపోతాడన్నారు జక్కన్న. బాహుబలి కోసం దాదాపు 15 మంది తమ కుటుంబ సభ్యులే పనిచేయడంపై వస్తున్న చిన్న చిన్న విమర్శలకు రాజమౌళి సమాధానమిచ్చారు. ‘వాళ్ల పని బాగుంటేనే అందరి మెప్పు పొందుతారు. లేకుంటే సినిమాకే నష్టం కదా. అందరూ ఏకిపారేస్తారు. చర్చలు గొడవలు వస్తాయి కదా’.. అని ఆయన తేల్చేశారు.

- Advertisement -