నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “ఇన్స్ పెక్టర్ రిషి”. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమోజాన్ ఒరిజినల్ గా “ఇన్స్ పెక్టర్ రిషి” ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇవాళ హైదరాబాద్ లో వెబ్ సిరీస్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు శ్రీ కృష్ణ దయాల్ మాట్లాడుతూ – “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ లో నేను సత్య అనే ఫారెస్ట్ రేంజర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మరో రెండు రోజుల్లో అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తోంది. చూడండి. అన్నారు.
నటుడు కన్నా రవి మాట్లాడుతూ – ఈ సిరీస్ లో నేను అయ్యనార్ అనే ఇన్సిపెక్టర్ రోల్ లో నటించాను. పది ఎపిసోడ్ల సిరీస్ ను డైరెక్టర్ నందిని గారు ఎంతో ఆసక్తికరంగా రూపొందించారు. చాలా పార్ట్ అడవిలో షూటింగ్ చేశాం. ఇందులో ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది. నవీన్ చంద్ర ఇన్స్ పెక్టర్ రిషిగా ఇరగదీశారు. సునైన గారు ఫారెస్ట్ ఆఫీసర్ గా ఆకట్టుకుంటారు. “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ ను మిస్ కావొద్దు. అన్నారు.
డైరెక్టర్ నందిని జేఎస్ మాట్లాడుతూ – తెలుగు ప్రేక్షకులు భాషలకు అతీతంగా వైవిధ్యమైన కంటెంట్ ను ఆదరిస్తారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు సినిమా వరల్డ్ సినిమా అయ్యింది. సాగరసంగమం నా ఫేవరేట్ తెలుగు మూవీ. “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ ను మొదట మేము తమిళం వరకే చేద్దామని అనుకున్నాం. కానీ మేకింగ్ అయ్యాక మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. నాకు చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ చూడటం, హారర్ బుక్స్ చదవడం ఇంట్రెస్ట్. అలా హారర్ సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఈ సిరీస్ చేశాను. ఈ సిరీస్ కథలో ఏ కులాన్నీ, మతాన్నీ, ఎవరి విశ్వాసాలను కించపరిచేలా సన్నివేశాలు ఉండవు. నవీన్ చంద్ర, సునైన తెలుగులో చాలా పాపులర్. నవీన్ చంద్ర టైటిల్ రోల్ చేశారు. తెలుగులో మంచి రీచింగ్ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. గుడ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సిరీస్ చూడండి, మీకు తెలిసిన వాళ్లకు చెప్పండి. మీ సపోర్ట్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
Also Read:KTR:రేవంత్‌కు దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీచేయాలి