- Advertisement -
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సారి వయనాడ్ నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న అమేథి నుండి ఈసారి పోటీ చేయడం లేదు రాహుల్. ఇక గత ఎన్నికల్లో వయనాడ్ నుండి భారీ మెజార్టీతో గెలిచారు రాహుల్.
2009 నుండి వయనాడ్‌లో కాంగ్రెస్‌దే గెలుపు. అందుకే ఈసారి వయనాడ్‌నే రాహుల్ ఎంచుకోగా ఆయనపై బీజేపీ నుండి కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. 2019లో సురేంద్రన్ పాతానమిట్ట నుండి పోటీ చేశారు. ఈసారి రాహుల్‌పై పోటీ చేస్తుండటంతో వయనాడ్‌పైనే అందరి దృష్టి నెలకొంది.
2020లో కేరళ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు రాహుల్. ఇక తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ శశి థరూర్ మధ్య పోటీ జరగనుండటంతో ఈ రెండు స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది.
Also Read:IPL 2024 :పాయింట్స్ టేబుల్..వివరాలివే!
- Advertisement -