రష్యాపై ఉగ్రదాడి జరిగింది. ఓ మ్యూజిక్ కన్సెర్ట్ జరగుతున్న సమావేశం మందిరంపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు ఓ వైపు కాల్పులు మరోవైపు బాంబులు విసరడంతో 70 మంది మృతి చెందగా 150 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. ఉగ్రదాడి నుండి తప్పించుకునేందుకు ప్రజలు కొంతమంది పరుగులు తీయగా మరికొంతమంది సీట్ల కింద దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదుల్లో ఒకరిని రష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే ఉగ్రదాడి జరగడం గమనార్హం. ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసీస్ ప్రకటించుకోగా దాదాపు 20 ఏళ్ల తర్వాత రష్యాలో ఇంతపెద్ద ఎత్తున ఉగ్రదాడి జరిగింది.
Also Read:IPL 2024 :చెన్నై బోణి.. ధోని రికార్డ్!
దాడుల వెను ఎవరున్న వదిలిపెట్టమని ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ స్పష్టం చేశారు. ఇక రష్యాపై ఉగ్రదాడిని ఖండించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.