అప్పుల ఊబిలో తెలంగాణ..వంద రోజుల్లోనే!

23
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అప్పుల శాతం అమాంతంగా పెరిగింది. గత బి‌ఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర అప్పులు పరిమితి మేర ఉండగా.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారిగా అప్పులు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఆ పార్టీ ప్రకటించిన ఎన్నికల హామీల నెరవెర్పు కోసం భారీగా అప్పు చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ చెప్పినట్లుగానే అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 వంటగ్యాసు, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటి అమలుకై రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అక్షరాల రూ.16,400 కోట్లు అప్పు చేసినట్లు తెలుస్తోంది. కేవలం వంద రోజుల్లోనే ఈ స్థాయిలో అప్పు భారం ఉండడం ఆందోళన కలిగించే అంశమే.

పోనీ అప్పు సంగతి సరేసరి అమలు చేస్తున్న పథకాలైన సరైన రీతిలో ప్రజలందరికి అందుతున్నాయా అంటే అది లేదు. అరకొరగా అమలు చేస్తున్న హామీలతోనే ఈ స్థాయిలో అప్పు చేస్తే ముందు రోజులో కాంగ్రెస్ చేసే అప్పులను ఊహించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ప్రతినెల రూ.2500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15000.. వంటి పథకాలను అమలు చేయాల్సిఉంది. వీటి అమలు తర్వాత రాష్ట్రం యొక్క అప్పు శాతం తారస్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదు. పెట్టుబడులను ప్రోత్సహించకుండా ఇదే తంతులో అప్పుల భారం పడితే ఆర్థికంగా అగ్రస్థానంలో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెఃచ్చరిస్తున్నారు, మొత్తానికి కేవలం వంద రోజుల్లోనే రూ.16 వందల కోట్లకు పైగా అప్పు చేసిన రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -