పవన్, చంద్రబాబులకు మోడీ గట్టిగానే షాక్ ఇచ్చారా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల సీట్ల కేటాయింపు పై కూడా స్పష్టత వచ్చిన సంగతి విధితమే. ఇక పార్టీల అధినేతలు ప్రచారంలో వేగం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ప్రజాగళం పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు, ఈ సభకు చంద్రబాబు, పవన్ తో పాటు మోడీ కూడా పాల్గొన్న సంగతి విధితమే. అయితే ఈ సభలో చంద్రబాబు, మరియు పవన్.. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఘాటైన విమర్శలు చేస్తూ రాజకీయ వేడి పెంచారు. కానీ మోడీ మాత్రం జగన్ పై ఎలాంటి విమర్శలు చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. .
ఏపీ మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారనే ఒకే ఒక్క విమర్శ తప్పా ప్రత్యక్షంగా జగన్ పై గాని ఆయన పాలన విధానంపై గాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి మొదటి నుంచి కూడా కేంద్ర పెద్దలు జగన్ విషయంలో సానుకూలంగానే ఉంటూ వస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ పాలనపై ఎలాంటి విమర్శలు చేయలేదు. దాంతో వైసీపీ బీజేపీ మధ్య అంతర్గత పొత్తు ఉందనే గుసగుసలు గత కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని జగన్ చెప్పడం, ఇక వేరే దారి లేక టీడీపీతో బీజేపీ జట్టు కట్టడం చకచకా జరిగిపోయాయి.
టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ భాగమైనప్పటికి అంతర్గతంగా బీజేపీ పెద్దలు వైసీపీతో దోస్తీ కోరుకుంటున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ప్రజాగళం సభలో జగన్ పై మోడీ ఎలాంటి విమర్శలు చేయలేదనే టాక్ వినిపిస్తోంది. ఇదే గనుక నిజం అయితే చంద్రబాబు, పవన్ లకు ఏ మాత్రం మింగుడు పడని విషయమే. ముందు రోజుల్లో ఎన్నికల ప్రచారల్లో బీజేపీ జాతియ నేతలు పాల్గొనాల్సి ఉంటుంది. వారంతా కూడా జగన్ పాలనపై విమర్శలు చేయకపోతే టీడీపీ జనసేన పార్టీలకు గట్టి దెబ్బే . మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:బీజేపీలో చేరను..తప్పుడు ప్రచారం ఆపండి