BJP:ఏపీలో బీజేపీ సత్తా చాటేనా?

33
- Advertisement -

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా కమలం పార్టీ 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపుపై స్పష్టత రావడంతో ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తోంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి డిల్లీకి పయనమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై డిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లతో లిస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీతో కలవడంపై రాష్ట్ర బీజేపీ నేతలలో కొందరు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయాలను కూడా పార్టీ పెద్దలకు పురందేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో సత్తా చాటలని కమలం పార్టీ కొన్నేళ్ల నుంచి గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న ఏపీలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. అందుకే ఈసారి ఎన్నికలతో ఎలాగైనా సత్తా చాటే ఆలోచనలో ఉన్నారు కమలనాథులు. అయితే ఆ పార్టీ పోటీ చేయబోయే పది స్థానాలపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికి బీజేపీ అభ్యర్థులకు వైసీపీ నుంచి తీవ్రమైన పోటీ ఉండనుంది. టీడీపీ జనసేన పార్టీల అండ ఉన్నప్పటికి బీజేపీపై ఉండే నెగిటివిటీ ఆ పార్టీని దెబ్బ తీసే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం, ప్రత్యేక హోదా విషయంలోనూ, విశాఖ స్టీల్ ప్లాన్ ప్రయివేటీకరణ విషయంలోనూ బీజేపీ సర్కార్ పై ఏపీ ప్రజలు గుర్రుగానే ఉన్నారు.

పైగా ఏపీ విషయంలో కేంద్రం చిన్న చూపు చూస్తోందనే అభిప్రాయాలూ కూడా గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి కేటాయించిన పది స్థానాల్లో గెలవడం ఆ పార్టీకి కత్తిమీద సామే. ఎంపీ సీట్ల విషయంలో కూడా ఆరు స్థానాల్లో గెలవడం అంతా ఈజీ కాదు. ఐతే పది అసెంబ్లీ సీట్లలో 4 సీట్లు గెలిచిన ఏపీలో బీజేపీ సక్సస్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రధానంగా ఎంపీ సీట్లనే టార్గెట్ చేస్తున్న బీజేపీ.. కనీసం మూడు చోట్ల గెలిచిన ఏపీలో పుంజుకున్నట్లే. మరి కమలం పార్టీ ఎంతవరకు సత్తా చాటుతుందో చూడాలి.

Also Read:బీజేపీలో చేరను..తప్పుడు ప్రచారం ఆపండి

- Advertisement -