లెఫ్ట్ పార్టీలకు కాలం చెల్లిందా ?

25
- Advertisement -

దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు గడ్డు కాలం ఏర్పడిందా ? ముందు రోజుల్లో వామపక్షాలు కనుమరుగు కానున్నాయా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వామపక్షలకు దేశవ్యాప్తంగా బలమైన మద్దతు ఉండేది, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో సిపిఎం సిపిఐ పార్టీలకు బలమైన నెట్వర్క్ ఉండేది కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు చాలా రాష్ట్రాలలో వామపక్షాలు బలహీన పడుతూ వస్తున్నాయి. 2004 లోక్ సభ ఎన్నికల్లో సిపిఎం 43 సీట్లు, సీపీఐ 10 సీట్లు, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ 3, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 3 సీట్లు, గెలిచి సత్తా చాటాయి. ఆ తర్వాత ఫెల్ట్ పార్టీలు మెల్లగా బలాన్ని కోల్పోతు వస్తున్నాయి..

గత ఎన్నికల్లో సిపిఎం 2, సిపిఐ 3 లోక్ సభ సీట్లకే పరిమితం అయ్యాయంటే లెఫ్ట్ పార్టీలు ఏ స్థాయిలో పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఈసారైనా తిరిగి పుంజుకుంటాయా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీయే కూటమి ఏకంగా 400 సీట్లు సాధించాలనే టార్గెట్ తో ఉంది. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే.. ఈసారి ఎలాగైనా మోడీ సర్కార్ ను గద్దె దించి తాము అధికారం చేపట్టాలనే ఆకాంక్షతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికల్లో కూడా నిరాశ తప్పదనే భావన వినిపిస్తోంది. ఒక్క కేరళ మినహా మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా వామపక్షాలు తిరిగి పుంజుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు భావజాలంతో ఉండే లెఫ్ట్ పార్టీలు ఏదో ఒక కూటమితో జట్టు కడతాయా ? లేదా మెల్లగా కనుమరుగవుతయా ? అనేది చూడాలి.

Also Read:లవ్ గురు..అందమైన లవ్‌స్టోరి

- Advertisement -