గవదబిల్లల వ్యాధి అనేది ఒక వైరస్ సంబంధిత వ్యాధి. 10-20 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాతావరణంలోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా.. ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి లాలాజల గ్రంథులపై ప్రభావం చూపినప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో రెండు వైపులా దవడకింది తీవ్రమైన వాపు, నొప్పి ఏర్పడుతుంది. గవదబిల్లల వ్యాధి సోకిన వారు ఆహారాన్ని తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కనీసం నీళ్ళు కూడా తాగలేరు. దవడ భాగాలు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. అంతే కాకుండా నోటిలో తరచూ లాలాజలం ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
ఇకపోతే ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, బలహీనత, చిరాకు, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలాకాలం తరువాత ఈ వ్యాధికి సంబంధించిన కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ వ్యాధి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన కేసులు నమోదు అవుతున్నాయి. అందువల్ల గవదబిల్లల వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా దీని వ్యాప్తి చలికాలంలో అధికంగా ఉంటుంది.
కానీ ఇప్పుడు వేసవిలో కూడా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదు అవుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది అంటువ్యాధి కావడం వల్ల ఈ వ్యాధి సోకిన వారికి దూరం పాటించడం మంచిది. ఇంకా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వైధ్యుల సలహా మేరకు తగు మెడిసన్ తీసుకోవాలి. ఈ వ్యాధి తాలూకు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. అందులో గడదబిల్లల వ్యాధిగా నిర్ధారణ అయినప్పుడు ఆ వ్యాధికి సంభంచిందిన టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి. కాబట్టి ఈ వ్యాది పట్ల తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ దూరం?