టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు దూరం కానున్నాడా ? అంటే అవుననే సమాధానాలు అడపా దడపా వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వేరెవరికీ సాధ్యం కానీ రికార్డులు కోహ్లీ సొంతం. ఫార్మాట్ ఏదైనా తన బ్యాటింగ్ తో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కోహ్లీ తరువాతే ఎవరైనా. అయితే టెస్టు, వన్డేలలో అద్బుతంగా రాణించే విరాట్.. టీ20 లలో రాణించడం కష్టమనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే టి20 ఫార్మాట్ లో దూకుడైన ఆటతీరుతో వేగంగా పరుగులు రాబట్టల్సి ఉంటుంది. కోహ్లీ దూకుడు స్వభావం కలిగి ఉన్నప్పటికి భారీ హిట్టింగ్ కొట్టడంలో కొంత వెనుకంజలోనే ఉన్నాడు. ప్రస్తుతం భారీ హిట్టింగ్స్ తో యువ ఆటగాళ్లు టి20 లలో అద్బుతంగా రాణిస్తున్నారు. అందువల్ల కోహ్లీ స్థానంలో వేరే యంగ్ ప్లేయర్స్ ను తీసుకునే అవకాశం లేకపోలేదని కొందరు చెబుతున్నారు. .
అయితే కోహ్లీని పక్కన పెట్టె అవకాశం లేదని టీ20 లలో అతని గణాంకాలు చూస్తే అద్బుతంగా ఉన్నాయని చెబుతున్నారు మరికొందరు క్రీడా విశ్లేషకులు. 2012,2014,2016,2022 టీ20 వరల్డ్ కప్ లలో కోహ్లీ టాప్ స్కోరర్ గా ఉన్నాడని చెబుతున్నారు. కోహ్లీ ఫార్మాట్ కు తగినట్లుగా తన బ్యాటింగ్ సరళిని మార్చుకుంటాడని, అది అతనికి ఉన్న రేర్ క్లాలిటీ అని క్రీడా అభిమానులు చెబుతున్నారు. పైగా కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ను పక్కన పెడితే చరిత్రాత్మక తప్పెదం అవుతుందని, బీసీసీఐ అలాంటి పని చేయదని చాలమంది అభిప్రాయం. ఇక ఇటీవల రెండో బిడ్డకు తండ్రి అయిన కోహ్లీ గత కొన్నాళ్లుగా ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తూ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఈ నెల 22 నా మొదలయ్యే ఐపీఎల్ తో తిరిగి జట్టులో రానున్నాడు. మరి వరల్డ్ కప్ కు ముందు కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read:నల్లవెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో..!