మరోసారి అన్నయ్యగా మెగాస్టార్?

23
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సినిమాలో కనిపిస్తాయని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర అని తెలుస్తోంది. హిట్లర్ లో మాదిరి చిరంజీవికి విశ్వంభరలో ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారట. మరి అరవై ఏళ్లు నిండిన చిరు, ముప్ఫై ఏళ్ల అన్నయ్యగా ఎలా మెప్పిస్తారన్నది వేచి చూడాలి.

ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజుల కిందట త్రిష కూడా సెట్స్‌పై అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు మెగాస్టార్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఓ ఖరీదైన టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్. ఈ గిఫ్ట్ తనకు బాగా నచ్చిందని త్రిష సోషల్ మీడియాలో పేర్కొంది. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి డ్యూయెల్ రోల్‌‌‌‌‌‌‌‌ లో కనిపించనున్నారు. కాకపోతే, సెకెండ్ హాఫ్‌‌‌‌‌‌‌‌ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌ లో మెగాస్టార్ చిరంజీవి ఓల్డ్ గెటప్‌‌‌‌‌‌‌‌ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అన్నట్టు త్రిష పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుందట.

యాక్షన్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌ తో పాటు ఫాంటసీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. త్రిష పాత్రలో చాలా ఎమోషన్స్ ఉంటాయట. ప్రస్తుతానికి త్రిష – చిరు పై ఓ సాంగ్ ను కూడా ఘాట్ చేయనున్నారు. ఇప్పటికే, ఈ సాంగ్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను వేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ క్యామిమో రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని, అలాగే స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో మిల్క్ బ్యూటీ తమన్నా, మరో కీలక పాత్రలో మరో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, విశ్వంభర 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

Also Read:Roja:రోజాకు నో టికెట్?

- Advertisement -