ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే ..‘లైన్ మెన్’

12
- Advertisement -

తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. మార్చి 15న ‘లైన్ మ్యాన్’ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శివ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్ లాంచ్ చేశారు. అనంతరం ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘లైన్ మెన్ పోస్టర్‌లు చూస్తేనే సినిమా చాలా కొత్తగా ఉండబోతోందని అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. మన మూలాల్లోకి వెళ్లి రాసుకునే కథలు, తీసే సినిమాలు ఆడియెన్స్‌కు ఎక్కువగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంటాయి. ఇలాంటి సినిమాను రాసిన, తీసిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రాన్ని ఎంతో నిజాయితీగా తీశారనిపిస్తుంది. అందుకే రియల్ లైన్ మెన్‌లను ఇక్కడకు పిలిచి సత్కరించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలి. ఇలాంటి కొత్త సినిమాలు ఆడితే.. మరి కొంత మంది ముందుకు వస్తారు. త్రిగుణ్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ తన చుట్టూ ఉండే వాళ్లని కంఫర్ట్‌గా ఉంచాలని ప్రయత్నిస్తుంటారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి. త్రిగుణ్ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలవాలి. మార్చి 15న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘తినే ప్రతీ మెతుకు మీద పేరు రాసి ఉంటుందని అంటారు.. ప్రతీ పాత్ర మీద కూడా చేసే వాడి పేరు రాసి ఉంటుంది. మన స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో చిన్న ఉడతలా సాయం చేస్తున్నాను. లేడీస్ లైన్ ఉమెన్‌గా రావడం చూసి.. ఈ సినిమాను చేయాలని అనుకున్నా. కథ సరిగ్గా ఆడలేదు.. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో అన్నీ బూతులే. డబ్బులు బాగా వచ్చాయి. కారు, ఇళ్లు కొనుక్కుని సెటిట్ అయ్యా. కానీ లైన్ మెన్ లాంటి సినిమాలు తీసినప్పుడు రాత్రి పూట ప్రశాంతంగా పడుకుంటాం. ఇప్పుడు సినిమాలకు భాషా సరిహద్దుల్లేవు. లైన్ మెన్‌లు చేస్తున్న సేవలను ఎవ్వరూ గుర్తించడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేశాను. ప్రకాష్ రాజ్ గారు నా మొదటి సినిమాను నిర్మించారు. ఆయనలా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంటుంది. నా కోరిక తీర్చిన నా నిర్మాతలకు థాంక్స్. వంశీ అన్న నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. బి. జయశ్రీ గారు ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్. ఆమెకు పద్మ శ్రీ అవార్డు వచ్చింది. అలాంటి వారు మా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నేను వాళ్లకి తెలుగు నేర్పించాను. వాళ్లు నాకు కన్నడ నేర్పించారు. అలా మా సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో షూట్ చేశాం. మనం ఇప్పుడు ఫోన్, టీవీ వంటి వాటికి బానిసల్లా మారాం. ఓ గంట కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చాం. ఓ ఊర్లో పది రోజులు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథ. లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఒకప్పుడు మా అమ్మ ఉండేది.. ఇప్పుడు లేరు.. సినిమా బిజీల్లో పడి ఎక్కువగా మాట్లాడేవాడ్ని కాదు. జీవితం చాలా చిన్నది.. చాలా విలువైనది. ఇలా ప్రతీది విలువైందే అని సందేశం ఇచ్చే చిత్రమిది. ఓపెనింగ్స్ తెప్పించేంత బలం, బలగం లేదు. కానీ మా కథే మా బలగం. ప్రతీ ఒక్కరూ మా సినిమాకు కనెక్ట్ అవుతారు. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సినిమా కంటెంట్ మారుతోంది. కథే హీరోగా మారింది. ఈ చిత్రం కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. పూర్తిగా పల్లెటూరిలోనే షూట్ చేశారు. త్రిగుణ్ ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

వర్దన్ పేట్ ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు హీరోలను చూసి సినిమాలు చూస్తుండేవారు. కానీ ఇప్పుడు కథలే హీరోగా మారాయి.కొత్త వాళ్లు వస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. లైన్ మెన్ ట్రైలర్ చూశాను. లైన్ మెన్ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. వారి జీవితాన్ని తెరపై తీసుకొస్తున్న హీరో, దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Also Read:IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!

- Advertisement -