GO 3తో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. మీడియాతో మాట్లాడిన కవిత… ఓటుకు నోటు కేసులో మీరు అప్పీల్ చేసుకోరా? మరి జీవో3 పై హైకోర్టు నిర్ణయాన్ని ఎందుకు సవాల్ చేయటం లేదు అని ప్రశ్నించారు.
ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై ఉమెన్స్ డే రోజు నిరసన తెలిపేందుకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో అనుమతి ఇవ్వటం లేదు. మీరు అనుమతిచ్చినా ఇవ్వకున్నా మా నిరసన ఆగదు. పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని చెప్పారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు.బీఆర్ఎస్ను బొంద పెట్టాలని రెండు జాతీయ పార్టీలూ చూస్తున్నాయని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకపోతే ప్రజలకే నష్టమన్నారు.
Also Read:ఒడిశాలో బీజేడీతో బీజేపీ!