- Advertisement -
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై విచారణ చేపట్టి నిర్ణయాన్ని వెలువరించింది. కోదండరాం,అమీర్ అలీఖాన్ నియామకాన్ని కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను కొట్టివేసింది.
గతంలో బీఆర్ఎస్ హయాంలో దాసోజు శ్రావణ్, సత్యనారాయణలను నియమించగా దానిని గవర్నర్ కొట్టివేసింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా కోదండారం,అలీఖాన్ పేర్లను గవర్నర్ తమిళి సైకి పంపగా ఆమె వెంటనే అమోదం తెలిపారు. దీనిని సవాల్ చేస్తూ దాసోజు శ్రావణ్ కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది.
Also Read:#Sharwa35..’మనమే’
- Advertisement -