‘పుష్ప 2’ పై పుకారు.. క్లారిటీ ఇదే

9
- Advertisement -

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప-2 ది రూల్. ఈ మూవీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. లేటెస్ట్ గా సినిమా సాంగ్ లీక్ అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. కానీ, అందులో నిజం లేదని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పుష్ప-2 షూటింగ్ ఒకవైపు వేగంగా జరుగుతూనే.. పుష్ప-3 కూడా తీయాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకున్నారట. రెండో భాగం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మూడో భాగం వచ్చే సంవత్సరం సమ్మర్‌లో రాబోతుందట. పుష్ప-2లోనే మూడో భాగానికి సంబంధించి ప్రధాన సీన్లు తీస్తున్నారట.

కాగా మిగిలిన భాగం, ఇయర్ ఎండింగ్ లో తీస్తారని సమాచారం. అయితే, పుష్ప 2 రిలీజ్ డేట్ మారుతుంది అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. ఆగస్టు 15.. పుష్ప 2 విడుదలయ్యే రోజు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ మారకుండా నిర్ణయించిన సమయానికే సినిమా విడుదలయ్యేలా దర్శకుడు సుకుమార్ చిత్ర యూనిట్‌ను పరుగెత్తిస్తున్నారట. అందుకోసం ఏకంగా రాత్రిళ్లు సైతం రెండు యూనిట్లు పెట్టి షూటింగ్స్ చేస్తున్నారు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం చేశారట.

ఇక పుష్ప 2 మొదటి భాగాన్ని మించి ఉంటుందని చెప్పడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే రోజురోజుకు పుష్ప‌2పై మ‌రింత హైప్ పెరుగుతూ పోతుంది. అందుకు అనుగుణంగానే మ‌రింత గ్రాండ్‌గా ‘పుష్ప‌2’ రాబోతుంది.

Also Read:రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా..

- Advertisement -