కృతి సనన్ బాగా తగ్గించేసింది

20
- Advertisement -

హిందీలో ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించిన ‘కృతి సనన్’ టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు ‘1 – నేనొక్కడినే’ సినిమాతో పాటు, ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో కూడా కృతి సనన్ నటించి మెప్పించింది. ఐతే, తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కృతి సనన్ కి అనుకున్నంత ఫేమ్ దక్కలేదు. దీంతో, మళ్ళీ బాలీవుడ్ కే ఎగిరిపోయింది కృతి సనన్. కానీ, అక్కడ కూడా కృతి సనన్ కి ప్రస్తుతం డిమాండ్ లేకుండా పోయింది. అందుకే, తనను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మార్చేసిన తెలుగు ఇండస్ట్రీ పై కృతి సనన్ మళ్లీ ఫోకస్ పెట్టింది.

సౌత్ స్టార్ హీరోల దృష్టి ఆటోమేటిక్ గా తన పై పడటానికి కృతి సనన్ ఇక్కడ ఓ మేనేజర్ ను కూడా పెట్టుకుంది. నిత్యం స్టార్ హీరోలతో టచ్ లోకి కూడా వెళ్తుంది అట. నిజానికి ప్యాన్ ఇండియా ఫిల్మ్ గేమ్ చేంజర్ సినిమాలో మొదట రామ్ చరణ్ తో జోడిగా కృతి సనన్ పేరే వినిపించింది. మేకర్స్ కూడా ఆమెను అప్రోచ్ అయ్యారు. మొత్తానికి గేమ్ చేంజర్ సినిమాలో కథానాయికగా తాను ఎన్నుకోబడ్డా డేట్స్ ఖాళీ లేక, ఉన్నవి సద్దుబాటు చెయ్యలేక ఆ సినిమా నుంచి కృతి సనన్ తప్పుకుంది.

మొత్తమ్మీద హిందీలో తనకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో కృతి సనన్ సౌత్ పై మమకారం చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు తెలుగు కూడా నేర్చుకునే పనిలో ఉందట. పైగా రెమ్యునరేషన్ ను కూడా తగ్గించుకోబోతుంది. ఇప్పటివరకు హిందీలో మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకుంటున్న కృతి సనన్, సౌత్ సినిమాల కోసం 2 కోట్లు మాత్రమే డిమాండ్ చేస్తుందట. మరి ఈ లెక్కన కృతి సనన్ సౌత్ లో గట్టిగానే ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి. అన్నట్టు కృతి సనన్ బాగా తగ్గించేసింది అంటూ సౌత్ మేకర్స్ ఆమె ఫోకస్ పెడుతున్నారు.

Also Read:IPL 2024:ఓపెనర్‌గా ధోని.. పూనకాలే?

- Advertisement -